బన్నీ మనసును తాకిన టిక్‌టాక్‌ వీడియో | Allu Arjun Shares Butta Bomma TikTok Video Says Its Heart Touching | Sakshi
Sakshi News home page

ఇది హార్ట్ టచింగ్‌ వీడియో: బన్నీ

Feb 11 2020 9:30 AM | Updated on Feb 11 2020 12:24 PM

Allu Arjun Shares Butta Bomma TikTok Video Says Its Heart Touching - Sakshi

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది నా హృదయాన్ని తాకిందంటూ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు.(అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్‌కు పాన్ ఇండియా క్రేజ్)

ఇంతకీ ఈ వీడియోలో ఆడిపాడుతోంది ఇద్దరు దివ్యాంగులు. కాళ్లు లేని వ్యక్తి బుట్టబొమ్మ అంటూ డ్యాన్స్‌ చేయగా దానికి చేతులు లేని యువతి డ్యుయెట్‌ చేసింది. దీనిపై బన్నీ స్పందిస్తూ ‘హార్ట్‌ టచింగ్‌ వీడియో. సంగీతం మనిషి వైకల్యాన్ని మర్చిపోయేలా చేస్తుందని ఈ వీడియో నిరూపించింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత హిట్టో, అందులోని పాటలు అంతకు రెట్టింపు పాపులర్‌ అయ్యాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బన్నీ తన తర్వాతి సినిమా కోసం దర్శకుడు సుకుమార్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ ఒక్క ఫొటో బన్నీ జర్నీకి నిదర్శనం.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement