అర్జున్‌ హ్యాపీ... పూజానే! | Allu Arjun, Pooja Hegde 'Duvvada Jagannatham' Release this month | Sakshi
Sakshi News home page

అర్జున్‌ హ్యాపీ... పూజానే!

Jun 4 2017 11:05 PM | Updated on Sep 5 2017 12:49 PM

అర్జున్‌ హ్యాపీ... పూజానే!

అర్జున్‌ హ్యాపీ... పూజానే!

కాలు మీద కాలేసుకుని హ్యాపీగా కుర్చీలో కూర్చున్న అల్లు అర్జున్‌ ఫోనులో ఏదో చెక్‌ చేసుకుంటున్నారు.

కాలు మీద కాలేసుకుని హ్యాపీగా కుర్చీలో కూర్చున్న అల్లు అర్జున్‌ ఫోనులో ఏదో చెక్‌ చేసుకుంటున్నారు. అతడి పక్కనే ఫ్లోర్‌ మీద పూజా హెగ్డే వర్కౌట్స్‌ పేరుతో పల్టీలు కొట్టినంత పని చేస్తున్నారు. ‘వాట్‌ ఈజ్‌ దిస్‌? పూజా... నీకు ఏమైంది ?’ అని అడిగారొకరు.అప్పుడామె ‘‘అల్లు అర్జున్‌తో డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు... స్ప్రింగులా స్టెప్స్‌ వేయాలి. అంతలా డ్యాన్స్‌ చేయాలంటే... కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెట్టి, శరీరాన్ని విల్లులా వంచాల్సిందే’’ అని చెప్పారు.

ఇది హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో రిహార్సిల్స్‌ చేస్తున్న టైమ్‌లో జరిగిన సరదా సీన్‌ అన్నమాట! అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్‌’. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమాలో రెండు సింగిల్‌ సాంగ్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ నెలలో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement