-
నాసామిరంగా... పైన కూడానా!
‘దువ్వాడ జగన్నాథం’ సినిమా ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా హీరో అల్లూ అర్జున్ చేతిలో ఫిడ్జెట్ను తిప్పుతూ కూర్చున్నారు. వెంటనే.. ‘బన్నీ చేతిలో ఉన్న ఆ వింత వస్తువు ఏంటీ?’ అని సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడది వింత వస్తువు కాదు. ప్రతి కుర్రాడి చేతిలో, ప్రతి పిల్లాడి చేతిలో కనిపిస్తూ ఉంది! దీనిని ‘ఫిడ్జెట్ స్పిన్నర్’ అంటారు. వేళ్ల మధ్య ఉంచుకుని తిప్పుతూ కూర్చుంటే స్ట్రెస్ తగ్గుతుందట. ఇప్పుడిది అంతరిక్ష కేంద్రంలోకి కూడా వెళ్లిపోయింది! అక్కడి నాసా సైటిసుల్టు కొందరు ఫిడ్జెట్ను తిప్పుతుంటే.. వారిలో ఒకరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నాసా. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 45 వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను చూశారు. ట్విట్టర్లో 20 వేల సార్లు రీట్వీట్ అయింది. పిల్లలు ఎక్కువగా చూస్తున్నారట. భూమి మీద అయితే ఇది భలే తిరుగుతుంది. మరి భూమ్యాకర్షణ లేని చోట! ఇంకా భలే తిరిగింది. మీరే చూడండి. -
అర్జున్ హ్యాపీ... పూజానే!
కాలు మీద కాలేసుకుని హ్యాపీగా కుర్చీలో కూర్చున్న అల్లు అర్జున్ ఫోనులో ఏదో చెక్ చేసుకుంటున్నారు. అతడి పక్కనే ఫ్లోర్ మీద పూజా హెగ్డే వర్కౌట్స్ పేరుతో పల్టీలు కొట్టినంత పని చేస్తున్నారు. ‘వాట్ ఈజ్ దిస్? పూజా... నీకు ఏమైంది ?’ అని అడిగారొకరు.అప్పుడామె ‘‘అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేస్తున్నప్పుడు... స్ప్రింగులా స్టెప్స్ వేయాలి. అంతలా డ్యాన్స్ చేయాలంటే... కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి, శరీరాన్ని విల్లులా వంచాల్సిందే’’ అని చెప్పారు. ఇది హైదరాబాద్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో రిహార్సిల్స్ చేస్తున్న టైమ్‌లో జరిగిన సరదా సీన్ అన్నమాట! అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్’. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమాలో రెండు సింగిల్ సాంగ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement