నాసామిరంగా... పైన కూడానా! | special story to spinner | Sakshi
Sakshi News home page

నాసామిరంగా... పైన కూడానా!

Oct 26 2017 11:30 PM | Updated on Oct 26 2017 11:35 PM

special story to  spinner

‘దువ్వాడ జగన్నాథం’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరో అల్లూ అర్జున్‌ చేతిలో ఫిడ్జెట్‌ను తిప్పుతూ కూర్చున్నారు. వెంటనే.. ‘బన్నీ చేతిలో ఉన్న ఆ వింత వస్తువు ఏంటీ?’ అని సోషల్‌ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడది వింత వస్తువు కాదు. ప్రతి కుర్రాడి చేతిలో, ప్రతి పిల్లాడి చేతిలో కనిపిస్తూ ఉంది! దీనిని ‘ఫిడ్జెట్‌ స్పిన్నర్‌’ అంటారు. వేళ్ల మధ్య ఉంచుకుని తిప్పుతూ కూర్చుంటే స్ట్రెస్‌ తగ్గుతుందట. ఇప్పుడిది అంతరిక్ష కేంద్రంలోకి కూడా వెళ్లిపోయింది!

అక్కడి నాసా సైటిసుల్టు కొందరు ఫిడ్జెట్‌ను తిప్పుతుంటే.. వారిలో ఒకరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది నాసా. అదిప్పుడు వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు 45 వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను చూశారు. ట్విట్టర్‌లో 20 వేల సార్లు రీట్వీట్‌ అయింది. పిల్లలు ఎక్కువగా చూస్తున్నారట. భూమి మీద అయితే ఇది భలే తిరుగుతుంది. మరి భూమ్యాకర్షణ లేని చోట! ఇంకా భలే తిరిగింది. మీరే చూడండి.

Advertisement
 
Advertisement
Advertisement