హాలీడే ట్రిప్కు బ్రిటన్ వెళ్లనున్న హీరో | Allu Arjun on a three-week holiday | Sakshi
Sakshi News home page

హాలీడే ట్రిప్కు బ్రిటన్ వెళ్లనున్న హీరో

May 6 2015 12:47 PM | Updated on Sep 3 2017 1:33 AM

హాలీడే ట్రిప్కు బ్రిటన్ వెళ్లనున్న హీరో

హాలీడే ట్రిప్కు బ్రిటన్ వెళ్లనున్న హీరో

పనులన్నీ పూర్తి చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కుటుంబం సభ్యులతో కలిసి మూడు వారాల పాటు బ్రిటన్ వెళ్లనున్నారు.

హైదరాబాద్: పనులన్నీ పూర్తి చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మూడు వారాల పాటు బ్రిటన్ వెళ్లనున్నారు. ఇటీవల రీలీజైన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్ర ప్రమోషన్ లో భాగంగా గత కొన్ని రోజులుగా బిజీగా గడిపారు. అంతేకాకుండా త్వరలో రీలీజ్ కాబోయే రుద్రమాదేవి చిత్రంలో డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నారు. దీంతో కొంత సమయం దొరకడంతో ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులొకరు తెలిపారు.

బ్రిటన్ నుంచి తిరిగి రావడంతోనే గీతా ఆర్ట్స్ బ్యానర్లో, బోయపాటి శ్రీనుతో చేయబోయే తదుపరి చిత్ర పనుల్లో పాల్గొంటారు. అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. రిలీజైన మూడు వారాల్లోనే బాక్స్ ఆఫీస్ లో 80 కోట్ల రూపాయల కలెక్షన్ లని రాబట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement