చెర్రీ నహీ... బన్నీ!? | Allu Arjun New Movie with Combination Koratala Siva | Sakshi
Sakshi News home page

చెర్రీ నహీ... బన్నీ!?

Nov 25 2017 12:23 AM | Updated on Nov 25 2017 1:45 AM

Allu Arjun New Movie with Combination Koratala Siva  - Sakshi - Sakshi - Sakshi

మహేశ్‌బాబు హీరోగా తీస్తున్న ‘భరత్‌ అనే నేను’ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ తీయబోయే సినిమాలో హీరో ఎవరు? మొన్నటివరకూ అయితే చెర్రీనే! అదేనండీ... రామ్‌చరణ్‌. కానీ, ఇప్పుడు కథ మారుతోందనీ, కథానాయకుడు మారుతున్నాడని ఫిల్మ్‌నగర్‌ గుసగుస! ఎందుకంటే... దర్శకుడు రాజమౌళి పేరు ప్రస్తావనలోకి వస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత ఆ సినిమా షూటింగ్‌ మొదలవుతుందట! రాజమౌళి సిన్మా సోదిలోకి రాకముందు సేమ్‌ టైమ్‌కి చరణ్‌–కొరటాల సినిమా స్టార్ట్‌ అవుతుందని గతంలోనే ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు రాజమౌళి సినిమాకి రామ్‌చరణ్‌ ‘యస్‌’ చెప్పడంతో కొరటాల ప్లాన్‌ మారిందని టాక్‌.  అందువల్ల మధ్యలో మరో కథతో అల్లు అర్జున్‌ హీరోగా సినిమా తీయాలని కొరటాల ప్లాన్‌ చేస్తున్నారట! ప్రస్తుతం హీరో, దర్శకుడు మధ్య డిస్కషన్స్‌ జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌! ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మిస్తారని మరో టాక్‌!!

Advertisement
 
Advertisement
Advertisement