మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో బిజీ బిజీ | Allu Arjun And Trivikram Movie Music Sittings Started | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో బిజీ బిజీ

Apr 12 2019 2:40 PM | Updated on Apr 12 2019 2:40 PM

Allu Arjun And Trivikram Movie Music Sittings Started - Sakshi

‘నా పేరు సూర్య’ ఇచ్చిన షాక్‌తో దాదాపు ఏడాది పాటు ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పని స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను ప్రకటించారు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

మొదటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో.. కలిసి సినిమా చేయనున్న బన్నీ.. తరువాత సుకుమార్‌, వేణు శ్రీరామ్‌తో కలిసి పనిచేయనున్నాడు. త్రివిక్రమ్‌తో చేయబోయే మూవీ షూటింగ్‌ ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. ఈలోపే మ్యూజిక్‌ సిట్టింగ్‌కు స్టార్ట్‌ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్‌, సిరివెన్నెలతో కలిసి ఉన్న ఫోటోను థమన్‌ షేర్‌ చేశారు. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement