చిరంజీవిగారి సంస్కారం తేజ్‌కి ఉంది | Allu Aravind Superb Speech At Prathi Roju Pandage Trailer Launch | Sakshi
Sakshi News home page

చిరంజీవిగారి సంస్కారం తేజ్‌కి ఉంది

Dec 6 2019 1:08 AM | Updated on Dec 6 2019 1:08 AM

Allu Aravind Superb Speech At Prathi Roju Pandage Trailer Launch - Sakshi

రాశీ ఖన్నా, అంజనా దేవి, సాయి తేజ్, అల్లు అరవింద్, మారుతి

‘‘సాయితేజ్‌ సినిమా చేస్తున్న ప్పుడు ఇతర పాత్రలకు ప్రాధా న్యం ఉండేలా చూస్తాడు. తన పాత్రతో పాటు ఇతర పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తే ఎంత మంచి సినిమా వస్తుందో చిరంజీవిగారికి బాగా తెలుసు. ఆయన లక్షణం తేజ్‌లో ఉంది’’ అన్నారు అల్లు అరవింద్‌. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడులవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను థియేటర్‌లో కుటుంబంతో కలిసి చూస్తే వచ్చే ఆనందం వేరు. చెప్పిన టైమ్‌కి మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. ఈ కథకు ఆడియ¯Œ ్స కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడానికి సహకరించిన నా టీమ్‌కి, గీతా, యూవీ బ్యానర్స్‌కు థ్యాంక్స్‌. కథ వినగానే చేద్దామని తేజ్‌ చెప్పాడు. సత్యరాజ్‌గారు ముందు తాత పాత్ర చేయనన్నారు. కథ విన్నాక ఒప్పుకున్నారు’’ అన్నారు.

‘‘మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘చిత్రలహరి’ సినిమాతో నా సెకండ్‌ కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఇప్పటి నుండి మీరు (మెగా అభిమానులు) తలెత్తుకునే సినిమాలే చేస్తాను. ‘ప్రతిరోజూ పండగే’ మీ అంచనాలకు మించి ఉంటుంది. ఇందుకు నాది, మారుతిది గ్యారెంటీ’’ అన్నారు సాయితేజ్‌. ‘‘అందరికీ నచ్చే సినిమా ఇది. తేజ్‌తో మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను’’ అన్నారు రాశీఖన్నా. సంగీత దర్శకుడు తమన్, నటుడు రావు రమేశ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.

Advertisement
 
Advertisement
Advertisement