తెలంగాణ సామాజిక అంశంపై చిత్రం

allani sridhar plans to after telangana state - Sakshi

‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగంలో మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. తెలుగు సినిమాల్లో తెలంగాణ పరిమళాలు పరిపూర్ణంగా వెదజల్లాలి’’ అని దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్‌ అన్నారు. ‘కొమరంభీమ్‌’ చిత్రంతో ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు అల్లాణి శ్రీధర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన ఉద్యమం విజవంతమైంది. రాష్ట్ర సామాజిక, రాజకీయాల్లో   మార్పులు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటీ? అన్న సామాజిక అంశంపై ఒక ఎమోషనల్‌ ఫ్యామిలీ స్టోరీని ప్లాన్‌ చేస్తున్నాం.

ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర జలవనరుల చైర్మన్‌ వి. ప్రకాశ్‌ ఓ పరిశోధనాత్మక కథ రాశారు. ఈ కథతో సినిమా తీయనున్నాను. అలాగే తెలుగులో 50 రోజులాడిన ‘చిలుకూరు బాలాజీ’ చిత్రాన్ని ‘బాలాజీ మందిర్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి కూడా దర్శకుడిని నేనే. ఓ ప్రముఖ బ్యానర్‌లో దర్శకుడిగా ఓ సినిమా కమిట్‌ అయ్యా’’ అన్నారు. గతేడాది జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో తాను తీసిన ‘డూడూ డీడీ’ ప్రదర్శి తమైందని, ‘సమక్క–సారక్క’ జాతరపై తీసిన డాక్యుమెంటరీకి ఫ్రాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అభినందనలు లభించడం ఆనందం’’ అని అన్నారు అల్లాణి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top