
తమిళసినిమా: నటుడు ధనుష్‌లో అన్నీ నచ్చాయ్ అంటోంది నటి మేఘఆకాశ్. ఈ చెన్నై చిన్నది తెలుగులో లై అనే చిత్రంలో నితిన్‌తో జత కట్టింది. ఇక తమిళంలో ఒరు పక్క కథై చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అంతకు ముందే స్టార్ నటుడు ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని కొట్టేసింది. ఈ జంట నటిస్తున్న ఎన్నైనోకి పాయుమ్ తోట్టా చిత్రం నిర్మాణంలో ఉంది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి నటి మేఘఆకాశ్ తెలుపుతూ ఆరంభంలోనే ధనుష్ వంటి ప్రముఖ నటుడితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం తన కెరీర్‌కు చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని చెప్పింది.
పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, అయితే నటనకు అవకాశం ఉన్న పాత్ర అని పేర్కొంది. నటుడు ధనుష్‌లో మీకు నచ్చిన విషయం ఏమిటన్న ప్రశ్నకు ఆయనలో నచ్చని అంశమే లేదని అంది. ధనుష్ గొప్ప నటుడని పేర్కొంది. అయితే షూటింగ్‌లో తనకంటే చాలా శాంతంగా ఉంటారని, అదే ఆయనలో లోటు అని చెప్పింది. ఇక గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడం తనకు ఒక స్కూల్ లాంటింది అని అంది. ఈ చిత్రం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాని, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొచ్చింది. అయితే ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా చిత్రం మాత్రం చాలా కాలంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. మేఘఆకాష్ నటించిన ఒరు పక్క కథ మాత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.