వినోదాల స్టూడియో   

Ali starting movie as hero - Sakshi

హాస్య నటుడు అలీ హీరోగా నటించిన చిత్రం ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో రిషిత హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. దిలీప్‌ రాజా దర్శకత్వంలో పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ సుకుమార్‌గారు ఓకే చేసిన కథ ఇది. జంధ్యాల మార్క్‌ కామెడీ ఉంటుంది.

ఈ చిత్రంలో హీరోకి 40 సంవత్సరాలు వచ్చేవరకు పెళ్లి కాదనే నాగదేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలోనే కంచు కనకరత్నంతో ప్రేమలో పడతాడు హీరో. వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా? నాగదేవత శాపం వల్ల ఆగిందా? అన్నది ఆసక్తికరం. పూర్తి హాస్యభరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన అలీగారు ఈ చిత్రంలో హీరోగా మంచి నటనని ప్రదర్శించారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్‌ రెడ్డి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top