ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాలి – శ్రీకాంత్‌ | Ala Nenu Ila Nuvvu movie launch | Sakshi
Sakshi News home page

ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాలి – శ్రీకాంత్‌

Mar 5 2018 12:35 AM | Updated on Mar 5 2018 12:35 AM

Ala Nenu Ila Nuvvu movie launch  - Sakshi

అమృత అయ్యర్, సాయి రోనక్, ఛరిష్మాపై క్లాప్‌ ఇస్తున్న శ్రీకాంత్‌

సాయి రోనక్, అమృత అయ్యర్,ఛరిష్మా శ్రీకర్‌ , శ్రీప్రియ ముఖ్య పాత్రల్లో వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలా నేను ఇలా నువ్వు’. రాజ్‌ కందుకూరి సమర్పణలో వీరశంకర్‌ నిర్మించనున్నారు. ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రీకాంత్‌ క్లాప్‌నివ్వగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బి గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వీరశంకర్‌ మాట్లాడుతూ– ‘‘వేరు వేరు సాంప్రదాయల మధ్య పెరిగే యువతీయువకులకు వేరువేరు అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచుల వల్ల ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నారన్నది ఈ సినిమా కథాంశం.

ఈ కథ 80–90 మథలో జరుగుతుంది. హెటివో ద్వారా నేరుగా ఇంట్లో హోమ్‌ థియేటర్స్‌లో విడుదల అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రేమా,యాక్షన్‌ను ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చెబుతున్నాం. మా ప్రయత్నం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు విఎన్‌ ఆదిత్య. ‘‘ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా ఇంట్లోనే కూర్చొని చూసే చిత్రంగా చేస్తున్న ఈ ప్రయత్నం కచ్చితంగా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీకాంత్‌. ‘‘వీరశంకర్‌ గారు చేస్తున ఈ ప్రయత్నం నచ్చి ఈ సినిమాలో భాగమైయాను’’ అన్నారు రాజ్‌ కందుకూరి. ఈ సినిమాకు సంగీతం:నిహాల్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement