దుమ్మురేపుతున్న ‘మిషన్‌ మంగళ్‌’!

Akshay Kumar Vidya Balan Film Mission Mangal Gets Bumper Opening - Sakshi

ముంబై: గత నాలుగేళ్లుగా బాలీవుడ్‌ ఖిలాడి అక్షయ్‌ తన సినిమాలను పండగల రోజున విడుదల చేస్తూ వస్తున్నాడు. బాలీవుడ్‌ కండల వీరుడు  సల్మాన్‌ ఖాన్‌ సినిమాల విడుదల అనగానే ఈద్‌ గుర్తుకు వచ్చినట్లే, అక్షయ్‌ కూడా తన సినిమాలను పంద్రాగష్టుకు విడుదల చేస్తూ సక్సెస్‌ కొడుతున్నాడు. ఇస్రో చేపట్టిన మార్స్‌ మిషన్‌ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన అక్షయ్‌ తాజా సినిమా ‘మిషన్‌ మంగళ్‌’ గురువారం వెండితెర మీదకు వచ్చింది. అక్షయ్‌ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది. రూ.29.16 కోట్లు కలెక్ట్‌ చేయడంతో అక్షయ్‌ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.

కాగా స్పూర్తిదాయక కథాంశంతో తెరకెక్కిన అక్షయ్‌ గత సినిమా ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’  2017 ఆగష్టు 15న విడుదలైన మొదటి రోజే రూ .13.1 కోట్లు సాధించింది. ఇక జగన్‌ శక్తి దర్శకత్వంలో మిషన్‌ మంగళ్‌ కూడా అక్షయ్‌కు హిట్‌నిచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటుగా ప్రముఖ నటి విద్యబాలన్‌, తాప్సీ పన్నూ, సోనాక్షి సిన్షా, నిత్యా మీనన్‌, కీర్తి కుల్హరిలు ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ఇక నిన్న విడుదలైన జాన్‌​ అబ్రాహం సినిమా ‘బాట్ల హౌస్‌’... అక్షయ్‌ ‘మిషన్‌ మంగళ్‌’తో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడలేక చతికిలపడింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top