5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు | Akshay Kumar Starrer Housefull 4 Crosses Rs Hundred Cr Mark | Sakshi
Sakshi News home page

రూ. వంద కోట్ల క్లబ్‌లో హౌస్‌ఫుల్‌ 4

Oct 30 2019 2:43 PM | Updated on Oct 30 2019 2:47 PM

Akshay Kumar Starrer Housefull 4 Crosses Rs Hundred Cr Mark - Sakshi

ఖిలాడీ అక్షయ్‌ హీరోగా రూపొందిన హౌస్‌ఫుల్‌ 4 హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది.

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్ల దిశగా సాగుతున్న ఈ మూవీ రూ 100 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది. సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా హౌస్‌ఫుల్‌ 4 హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో​సత్తా చాటుతోంది. మంగళవారం రూ 24 కోట్లు రాబట్టిన హౌస్‌ఫుల్‌ 4 విడుదలైన 5 రోజుల్లోనే రూ. 111 కోట్లు వసూలు చేసింది.

భాయ్‌ దూజ్‌ వేడుకల నేపథ్యంలో సెలవు దినం కలిసిరావడంతో ముంబై, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, యూపీ, రాజస్ధాన్‌ ప్రాంతాల్లో మంగళవారం భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్‌హిట్‌ హౌస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో నాలుగవ భాగంగా విడుదలైన హౌస్‌ఫుల్‌ 4ను సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కించారు. అక్షయ్‌తో పాటు కృతి సనన్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌, కృతి కర్బందా, పూజా హెగ్డే, చుంకీ పాండే తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement