100 రోజులు...100 కోట్లు.. దే..వు..డా... | Akshay Kumar is paid Rs 1 crore per day for Jolly LLB 2? | Sakshi
Sakshi News home page

100 రోజులు...100 కోట్లు.. దే..వు..డా...

Aug 18 2016 11:34 PM | Updated on Sep 4 2017 9:50 AM

100 రోజులు...100 కోట్లు.. దే..వు..డా...

100 రోజులు...100 కోట్లు.. దే..వు..డా...

‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ ‘దే..వు..డా’ అంటూ అదో విచిత్రమైన స్టైల్‌లో చెప్పిన డైలాగ్‌ని ఎప్పటికీ మరచిపోలేం.

‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ ‘దే..వు..డా’ అంటూ అదో విచిత్రమైన స్టైల్‌లో చెప్పిన డైలాగ్‌ని ఎప్పటికీ మరచిపోలేం. విచిత్రమైన సంఘటనలు జరిగినప్పుడు ‘దేవుడా’ అని పిల్లలూ పెద్దలూ అనడం ఆ సినిమా తర్వాత కామన్ అయిపోయింది. బాలీవుడ్ హీరో, ‘రోబో 2’ విలన్ అక్షయ్‌కుమార్ పారితోషికం వింటే కచ్చితంగా ఎవరైనా ఆ మాట అంటారు. మామూలుగా అక్షయ్‌కుమార్ ఏ సినిమా చేసినా రోజుకి కోటి రూపాయలు తీసు కుంటారట. అందుకే తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసు కుంటారు.
 
  అక్షయ్ నటించే సినిమాలన్నీ దాదాపు 40 రోజుల్లోపే పూర్తవుతాయట.  కానీ, ‘జాలీ ఎల్‌ఎల్‌బి 2’కి ఆ అవకాశం లేదని తెలుస్తోంది. అర్షద్ వార్శి హీరోగా సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’కి ఇది సీక్వెల్. మలి భాగంలో అక్షయ్‌కుమార్‌ని తీసుకున్నారు. ఇందులో కోర్ట్ సీన్స్ ఎక్కువ ఉండడంతో ఉదయం 10 గంటలకు చిత్రీకరణ మొదలుపెట్టి రాత్రి 8 గంటల వరకూ జరుపుతున్నారట. షూటింగ్‌కి మినిమమ్ 100 రోజులు పడుతుందట. సో.. ఈ చిత్రానికి అక్షయ్ తీసుకోబోతున్న పారితోషికం 100 కోట్ల రూపాయలన్న మాట. దే..వు..డా...!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement