ఆగస్టు 15న ‘గోల్డ్‌’

Akshay Kumar Gold To Release On 15th August  - Sakshi

అక్షయ్‌కుమార్‌ హీరోగా దర్శకురాలు రీమా ఖగ్తి రూపొందిస్తున్న చిత్రం ‘గోల్డ్‌’. హాకీ ప్లేయర్‌ బల్బీర్‌సింగ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ప్లేయర్‌ బల్బీర్‌ సింగ్‌. బల్బీర్‌ సింగ్‌ బెంగాలీ కావటంతో స్పెషల్‌గా ఓ కోచ్‌ను పెట్టుకొని మరి బెంగాలీ నేర్చుకున్నాడు అక్షయ్‌. అంతేకాదు క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్‌ కోసం బెంగాలీ కల్చర్, కట్టుబొట్టులపై కూడా చాలా రిసెర్చ్‌ చేసి ఈ సినిమాలో నటించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కునాల్ కపూర్‌,మౌనీరాయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రటించారు. తాజాగా రిలీజ్ డేట్‌ పోస్టర్‌ను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు అక్షయ్‌. అక్షయ్‌ ప్రతినాయక పాత్రలో నటించిన 2.ఓ ఆగస్టులో రిలీజ్ అవుతుందన్న టాక్‌ వినిపించటంతో గోల్డ్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని భావించారు. అయితే 2.ఓ రిలీజ్ ఇప్పట్లో లేకపోవటంతో ముందుగా ప్రకటించినట్టుగానే గోల్డ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top