అక్షర పోరాటం | Akshara Mostion Poster release | Sakshi
Sakshi News home page

అక్షర పోరాటం

Jan 15 2019 12:23 AM | Updated on Jan 15 2019 12:23 AM

Akshara Mostion Poster release - Sakshi

నందితా శ్వేత

విద్య సమాజాన్ని మార్చే బలమైన ఆయుధం అంటున్నారు దర్శకుడు చిన్నికృష్ణ. కానీ ఇప్పుడు సమాజంలో విద్యను మించిన వ్యాపారం మరోటి లేదు అని అందరూ అంటుంటారు. విద్యా వ్యవస్థను కథా వస్తువుగా చేసుకుని నందితా శ్వేత ముఖ్య పాత్రలో దర్శకుడు చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అక్షర’. సురేష్‌ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మాతలు.

భోగి పండగ సందర్భంగా ‘అక్షర’ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఫక్తు వ్యాపారంగా మారిపోయిన విద్యా వ్యవస్థపై అక్షర చేసే పోరాటమే ఈ సినిమా. నందిత కెరీర్‌లోనే అక్షర బెస్ట్‌ పాత్రగా నిలుస్తుంది. సురేశ్‌ బొబ్బిలి అందించిన బ్యాక్‌గౌండ్‌ స్కోర్‌ సినిమాకు హైలెట్‌ అవుతుంది. ఇటీవలే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. వేసవిలో సినిమాను విడదల చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement