‘మామయ్యకు మహా ఇష్టం’ | Akkineni Amala Attend Bengali Film Festival | Sakshi
Sakshi News home page

‘మామయ్యకు మహా ఇష్టం’

Jul 13 2019 8:23 AM | Updated on Jul 13 2019 8:23 AM

Akkineni Amala Attend Bengali Film Festival - Sakshi

నా మాతృభాష బెంగాళీ.. మా మామయ్య అక్కినేని నాగేశ్వరరావుకు బెంగాళీ సినిమాలంటే ఎంతో ఇష్టమని

పంజగుట్ట: నా మాతృభాష బెంగాళీ.. మా మామయ్య అక్కినేని నాగేశ్వరరావుకు బెంగాళీ సినిమాలంటే ఎంతో ఇష్టమని, పలు సినిమాలను తెలుగులో రీమేక్‌ చేశారని ప్రముఖ నటి అక్కినేని అమల అన్నారు. బెంగాళీస్‌ ఇన్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఆరవ ‘హైదరాబాద్‌ బెంగాళీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ వివరాలను ఎర్రమంజిల్‌లోని హోటల్‌ మెర్క్యూరీలో శుక్రవారం వివరించారు. కార్యక్రమానికి హాజరైన అమల మాట్లాడుతూ.. మా మామయ్యకు బెంగాళ్‌ సినిమాలంటే ఎంతో మక్కువ అన్నారు.

ఈ ఫెస్టివల్‌కు 50 మంది ప్రముఖులు బెంగాళ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకావడం సంతోషకరమన్నారు. ఫెస్టివల్‌ డైరెక్టర్‌ పార్థ పాతమ్‌ మలిక్‌ మాట్లాడుతూ.. ఫెస్టివల్‌ను ఈ నెల 18వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని శివ థియేటర్‌లో ప్రారంభిస్తున్నప్పటికీ అధికారికంగా 19వ తేదీన బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ సినీ నిర్మాత బుద్దదేబ్‌ దాస్‌గుప్త ప్రారంభిస్తారని తెలిపారు. బెంగాళి సినిమా ఈ యేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిగ్గజాల సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. బెంగాలి ఇన్‌ హైదరాబాద్‌ అధ్యక్షురాలు మోసొమి శర్మ, జాయింట్‌ కన్వీనర్‌ మాలిక్‌ బసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement