
అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) 101వ జయంతి సందర్భంగా పలు సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు మరోసారి వెండితెరపైకి రానున్నాయి. చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం హిట్ సినిమాలు మరోసారి రానున్నాయి. ఉచితంగానే టికెట్లు ఇవ్వనున్నారు.
డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు సెప్టెంబర్ 20 నుంచి రీ-రిలీజ్ అవుతున్నాయి. బుక్ మై షో లో సెప్టెంబర్ 18 నుంచి ఉచితంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా థియేటర్స్ వద్దకు వెళ్లి డైరెక్ట్‌గానే పొందవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ( కృష్ణ టాకీస్), విశాఖపట్నం (క్రాంతి), ఒంగోలు( స్వర్ణ ప్యాలెస్) వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శనలు జరగనున్నాయి. పలు చోట్ల ఇంకా థియేటర్స్ ప్రకటించలేదు. నేడు అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఏఎన్నార్ అభిమానులకు ఫ్రీ టికెట్స్ అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.