అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక.. | Akkineni Adithya Engagement With Aishwarya | Sakshi
Sakshi News home page

అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక..

Dec 12 2019 7:21 PM | Updated on Dec 13 2019 6:17 PM

Akkineni Adithya Engagement With Aishwarya - Sakshi

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. కింగ్‌ నాగార్జున సోదరుడు వెంకట్‌ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌, అమల, సుమంత్‌, సుప్రియా, నాగసుశీల, సుశాంత్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే తన సోదరుడు ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే ఈ ఫొటోలో నాగచైతన్య భార్య సమంత కనిపించకపోవడంతో.. సమంత ఎక్కడ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య, వెంకటేశ్‌తో కలిసి నటించిన మల్టీస్టారర్‌ ‘వెంకీ మామా’  శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement