అభిమానులకు ఇది పండగ సీజన్ | akhil speech in atadukundam ra audio launch | Sakshi
Sakshi News home page

అభిమానులకు ఇది పండగ సీజన్

Aug 7 2016 12:41 AM | Updated on Sep 4 2017 8:09 AM

అభిమానులకు ఇది పండగ సీజన్

అభిమానులకు ఇది పండగ సీజన్

‘‘ముంబైలో అమితాబ్ బచ్చన్ గారితో యాడ్ షూటింగ్ ఉండడంతో నాన్నగారు రాలేదు. మీకు (అభిమానులకు) సారీ చెప్పమన్నారు.

‘‘ముంబైలో అమితాబ్ బచ్చన్ గారితో యాడ్ షూటింగ్ ఉండడంతో నాన్నగారు రాలేదు. మీకు (అభిమానులకు) సారీ చెప్పమన్నారు. త్వరలో అక్కినేని అభిమానులందరికీ పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది. వరుసగా సినిమాలు వస్తాయి. సుశాంత్‌కు సినిమాలు తప్ప వేరే లోకం ఉండదు. ఈ సినిమా తన అర్హతకు తగిన విజయం అందిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అఖిల్. సుశాంత్, సోనమ్ ప్రీత్ బజ్వా జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్ బేనర్స్‌పై  చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన సినిమా ‘ఆటాడుకుందాం.. రా’.

అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీలను అఖిల్ ఆవిష్కరించి సుశాంత్, అనూప్‌లకు అందించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను సుమంత్ విడుదల చేశారు. అఖిల్ మాట్లాడుతూ - ‘‘అనూప్ మా సినిమాలన్నిటికీ ప్రాణం పోస్తున్నాడు. మా నాన్నకు తమ్ముడిలా.. నాకు, చైతూకీ అన్నయ్యలా పనిచేస్తాడు. వుయ్ లవ్ యూ అనూప్. రెండో సినిమా స్టార్ట్ చేసే ముందు కొంచెం చార్జింగ్ తగ్గింది. ఇవాళ మొత్తం చార్జ్ అయ్యాను. రెడీగా ఉన్నాను’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ - ‘‘నాగచైతన్య, అఖిల్ చేసిన ప్రత్యేక పాత్రలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. మనసుకు నచ్చిన సినిమాలు చేయాలనుకోవడంతో గ్యాప్ వస్తోంది’’ అన్నారు.

నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ - ‘‘నాలుగేళ్ల క్రితమే సుశాంత్‌తో సినిమా చేయాల్సింది. లేటైనా మంచి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘మంచి టీమ్ కుదిరింది. తప్పకుండా హిట్ సాధిస్తాం. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సుశాంత్ డెడికేషన్ చాలా ఇష్టం. డ్యాన్స్, ఫైట్స్‌లలో తన హార్డ్ వర్క్ కనిపిస్తోంది. నా సినిమా సెప్టెంబర్‌లో లేక అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటు న్నాను’’ అని సుమంత్ అన్నారు. దర్శకులు కల్యాణ్‌కృష్ణ, కార్తీక్ రెడ్డి, పల్నాటి సూర్యప్రతాప్, నిర్మాత మల్కాపురం శివకుమార్, నటుడు బ్రహ్మానందం, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement