కొత్త ప్రయాణం

Akhil and Bommarillu Bhaskar film launched - Sakshi

‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌. ఆయన దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మలు నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. అల్లు అరవింద్‌ మనవరాలు బేబి అన్విత క్లాప్‌ కొట్టగా, అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్‌ భార్య నిర్మల,  చిరంజీవి సతీమణి సురేఖ, అక్కినేని అమల, దర్శకులు శ్రీకాంత్‌ అడ్డాల, మారుతి, పరశురామ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. మణికందన్, సంగీతం: గోపీ సుందర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top