రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

Ajith Qualifies Finals For Shooting Championship - Sakshi

పెరంబూరు : నటుడు అజిత్‌ రైఫిల్‌ షూట్‌ ఫోటీల్లో ఫైనల్‌కు చేరుకున్నారు.అజిత్‌ నటుడిగానే కాకుండా పలు రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారనే విషయం తెలిసిందే. ఈయన మంచి నలభీముడు, ముఖ్యంగా బిర్యాని వండడంలో దిట్ట. షూటింగ్‌ల్లో తాను చేసిన బిర్యానీతో చిత్ర యూనిట్‌ను ఆహా అనిపిస్తారు. ఇక కారు, బైక్‌ రేసుల్లోనూ పాల్గొంటుంటారు. అదే విధంగా ఎరో మోడలింగ్‌ వంటి వాటిలో పరిజ్ఞానం కలిగివ వ్యక్తి. మ్యాన్‌ పవర్‌ లేని బుల్లి విమానాలను తయారు చేసే ఎంఐటీకి చెందిన దక్ష అనే విద్యార్థుల టీమ్‌కు సలహాదారుడిగానూ వ్యహరిస్తున్నారు. ఇక చాలా కాలంగా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పని చేసే విమానాల తయారీలోనూ దృష్టి సారిస్తున్నారు. కాగా తాజాగా రైఫిల్‌ షూట్‌ పోటీలకు సిద్ధం అయ్యారు. ఇటీవల కోవైలోని పోలీస్‌ అకాడమీ మైదానంలో జరిగిన జాతీయ స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో తమిళనాడు రైఫిల్‌ షూట్‌ సంఘం తరఫున పాల్గొని ఫైనల్‌కు చేరుకున్నారు. కాగా డిసెంబరు నెలలో మధ్య ప్రదేశ్‌లో జరగనున్న ఫైనల్‌ రైఫిల్‌ షూట్‌ పోటీల్లో అజిత్‌ పాల్గొననున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top