సామికి జోడీ కుదిరింది | Aishwarya Rajessh joins Vikram's Saamy 2 | Sakshi
Sakshi News home page

సామికి జోడీ కుదిరింది

Jul 7 2018 1:14 AM | Updated on Jul 7 2018 1:14 AM

Aishwarya Rajessh joins Vikram's Saamy 2 - Sakshi

ఐశ్వర్య రాజేశ్‌, విక్రమ్

2003లో వచ్చిన ‘సామి’లో విక్రమ్, త్రిష భార్యాభర్తలుగా యాక్ట్‌ చేశారు. ‘సామి’ సీక్వెల్‌ ‘సామి స్క్వేర్‌’లో కూడా త్రిష యాక్ట్‌ చేస్తారని భావించారందరూ. త్రిష కూడా ముందు ఈ సినిమా కమిట్‌ అయ్యారు. ఆ తర్వాత క్రియేటీవ్‌ డిఫరెన్సెస్‌తో ‘సామి స్క్వేర్‌’ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారు. తాజాగా త్రిష ప్లేస్‌లోకి ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌గా వచ్చారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీలో జాయిన్‌ అవ్వడం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌లో ఫుల్‌ కమర్షియల్‌ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేస్తుందని భావిస్తున్నాను. విక్రమ్‌సార్‌ పక్కన, హరి సార్‌ డైరెక్షన్‌లో యాక్ట్‌ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. సినిమా ఆగస్ట్‌లో రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement