వృద్ధురాలిగా..! | Aishwarya Rai Bachchan to play the role of Dalbir Kaur in Omung Kumar's 'Sarbjit' biopic | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిగా..!

Jun 5 2015 11:22 PM | Updated on Sep 3 2017 3:16 AM

వృద్ధురాలిగా..!

వృద్ధురాలిగా..!

‘జజ్బా’లో కిడ్నాప్‌కు గురైన ఓ బాలిక తల్లిగా నటిస్తున్నారు ఐశ్వర్యారాయ్. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు

 ‘జజ్బా’లో కిడ్నాప్‌కు గురైన ఓ బాలిక తల్లిగా నటిస్తున్నారు ఐశ్వర్యారాయ్. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నారేమో. ఈ చిత్రం చేస్తుండగానే, మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారామె. ఇందులో ఐష్  61 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారు. నిజజీవిత కథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మద్యం మత్తులో ఇండో- పాక్ సరిహద్దు దాటి పాక్ సైనికుల చేతిలో చిక్కుకుని, ఆ తర్వాత జైలులో తోటి ఖైదీల చేతిలో హతమైన సరబ్‌జీత్ సింగ్ గుర్తున్నాడు కదా! ఆయన జీవితం ఆధారంగానే ఈ సినిమా రానుంది. ఇందులో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రలోనే ఐశ్వర్వ నటించనున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న ఐష్ ఆరు పదుల వయసులో ఉన్న వృద్ధురాలిగా ఒదిగిపోవడానికి ఎంతైనా కష్టపడాలను కుంటున్నారట. ఇంకా సరబ్‌జిత్ సింగ్ పాత్రకు ఎవర్నీ ఎంపిక చేయలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement