3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో | Adivi Sesh has Decided to Lose 10kgs Weight to Play The Role of Major | Sakshi
Sakshi News home page

3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో

Aug 24 2019 4:04 PM | Updated on Aug 24 2019 6:31 PM

Adivi Sesh has Decided to Lose 10kgs Weight to Play The Role of Major - Sakshi

ఎవరు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్‌, తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ఓ బయోపిక్‌లో నటించనున్నాడు శేష్‌. అశోక్‌ చక్ర అవార్డు పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్ కథతో తెరకెక్కుతున్న మేజర్‌ సినిమాలో నటించనున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను సూపర్‌ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించేందుకు శేష్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడట. ‘నిజమైన సైనికుడిగా కనిపించేందుకు మూడు నెలల్లో 10 కిలోలు బరువు తగ్గాల్సి ఉంది. అందుకోసం స్ట్రిక్ట్ డైట్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకొని కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నాను. అమ్మచేతి వంటను కాదనాల్సిన పనిలేదు. ఆమె కాలిఫోర్నియాలో ఉంటున్నా’రని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement