ఫస్ట్‌ లుక్‌.. పర్‌ఫెక్ట్‌ గూఢచారి | Adivi Sesh Goodachari First look | Sakshi
Sakshi News home page

Jan 13 2018 7:50 PM | Updated on Jan 13 2018 7:53 PM

Adivi Sesh Goodachari First look - Sakshi

క్షణం, అమీ తుమీ హిట్లతో జోరు మీదున్న యంగ్‌ హీరో అడివి శేష్‌ ఇప్పుడు ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. 

స్టైలిష్‌ గా ఉన్న శేష్‌ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్‌ అధికారి రవి పట్నాయక్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్‌ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్‌ గా నటిస్తోంది. 

ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార‍్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్‌) రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమ్మర్‌లో గూఢచారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement