ప్రభుదేవాతో మరోసారి.. | Actress Tamanna is pairing with Prabhu Deva in Devi Sequel | Sakshi
Sakshi News home page

ప్రభుదేవాతో మరోసారి..

Oct 6 2017 5:38 AM | Updated on Oct 6 2017 5:38 AM

Actress Tamanna is pairing with Prabhu Deva in Devi Sequel

తమిళసినిమా: మార్కెట్‌ పడిపోయింది. అవకాశాలు లేవు. ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనే టాక్‌ స్ప్రెడ్‌ అయినప్పుడల్లా నటి తమన్నాకు అవకాశాలు తలుపుతడుతూ ఆ ప్రచారం తప్పని సమాధానాన్ని ఇస్తున్నాయి. బాహుబలి–2 చిత్రంలో తమన్నా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు కదా, ఆ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. అదే సమయంలో శింబుతో రొమాన్స్‌ చేసిన అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ తీవ్రంగా నిరాశపరచింది.

దీంతో విక్రమ్‌తో నటిస్తున్న స్కెచ్‌ పైనే ఆశలు పెట్టుకున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా మరో అవకాశం వచ్చింది. డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతో మరోసారి రొమాన్స్‌ చేసే అవకాశం తమన్నా తలుపు తట్టింది. ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌ రూపొందనుందని, అందులోనూ తమన్నా, ప్రభుదేవాతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకు ముందే ఈ క్రేజీ జంట మరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం.

కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్ల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పవచ్చు. రజనీకాంత్‌ 2.ఓ, విక్రమ్‌ సామి–2, సుందర్‌.సీ కలగలప్పు–2 చిత్రాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా విశ్వనటుడు కమలహాసన్‌ ఇండియన్‌–2కు రెడీ అవుతున్నారు. ఇలా మరి కొన్ని చిత్రాలకు సీక్వెల్స్‌ తెరకెక్కుతున్న తరుణంలో చార్లీచాప్లిన్‌ చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 2002లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం చార్లీచాప్లిన్‌.

ప్రభుదేవా,ప్రభు, అభిరామి,గాయత్రి రఘురామ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. దీనికిప్పుడు సీక్వెల్‌ తెరకెక్కనుంది. ఇందులో ప్రభుదేవాకు జంటగా నటి తమన్నా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement