
ఇప్పుడు దేశంలో ఉన్న అగ్రగామి నటీమణుల్లో ఒకరుగా ఉంది తమన్నా భాటియా.. అటు సినిమాలు, ఇటు ఐటమ్ సాంగ్స్ మరోవైపు వెబ్ సిరీస్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం డయానా పెంటీతో కలిసి చేసిన ’డూ యు వాన్నా పార్టనర్’ వెబ్ సిరీస్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది, ఒక మహిళ స్వంతంగా వ్యాపార రంగంలో అది కూడా పురుషులు మాత్రమే చేయగలరు అని అందరూ నమ్మే మద్యం తయారీ రంగంలోకి మహిళలు ప్రవేశించడం... తదనంతర పరిస్థితుల చుట్టూ అల్లుకున్న అంశాలతో ’డూ యు వాన్నా పార్టనర్’ రూపొందింది.
ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె . ఒక పురుషుడు తనను ‘ఇక తనేమీ చేయడానికి లేదు‘ లేదా ‘అతనే తుది నిర్ణయం తీసుకున్నాడు అని భావించేలా చేసిన ప్రతిసారీ (అంటే ఆమెను చులకనగా తీసి పారేసిన సమయంలో) ఆమె ఎలా స్పందిస్తుందనే విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా పురుషాధిక్య చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్లేస్‌ను సొంతం చేసుకోవడం అనేది ఎలా సాధ్యమైందనే విషయంపైన కూడా తమన్నా ఈ సందర్భంగా మాట్లాడింది. అంతేకాక ఇటీవల తన నటన పట్ల విమర్శలు, ఎక్స్‌పోజింగ్‌పై వస్తున్న కొన్ని కామెంట్స్ గురించి కూడా ఆమె చెప్పాలనుకున్నట్టు ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.
‘‘ఒక పురుషుడు నాకు సంబంధించిన విషయాలలో తుది నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అందులో నేనేం చేయడానికి ఉండదు. అయితే, నాకు అనిపించేలా చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు’’ అంటూ చెప్పిందామె. అంటే ఒక సినిమాలో తాను చేసేదేముంది జస్ట్ ఏదో పాటల్లో అలా గ్లామరస్‌గా కనిపించడమే కదా అంటూ మాట్లాడి తన ప్రాధాన్యత తగ్గించాలని కొందరు మగవాళ్లు భావిస్తారనే అర్ధం వచ్చేలా మాట్లాడింది. అలా వారు ప్రయత్నించినప్పుడల్లా, తాను అలాంటి మగవాళ్లను చీరలో లేదా కొన్ని గ్లామరస్ దుస్తుల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్టు ఊహించుకునే దానిని అంటూ చెప్పింది. ఆ ఆ ఊహల్లో అతను చాలా అసహ్యంగా కనిపించేవాడనీ అప్పుడే తనకు తానేం చేయగలదో అతనేం చేయలేడో అనేది తనకు అర్ధమయ్యేదని అంటూ అమ్మాయిలు మాత్రమే గ్లామర్ కు కేరాఫ్ అని వారికి మాత్రమే ఎక్స్‌పోజింగ్ బాగుంటుందని చెప్పకనే చెప్పింది.

కాబట్టి వారికి ఎప్పుడూ తన అవసరం ఉంటుందనే గ్రహింపు తెచ్చుకోవడమే తాను చేసే పనిని ధైర్యంగా చేసేలా చేసిందని అంది, ‘‘ఎందుకంటే ఒక మహిళ చేయగలది, ఒక మహిళ మాత్రమే చేయగలదని నేను విశ్వసిస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో మంచి చెడుల గురించి కూడా ఆమె మాట్లాడింది.
‘‘నువ్వు మంచి వ్యక్తివి అయినంత మాత్రానే ఎవరూ నీకు పని ఇవ్వరు. నువ్వు ఏదో ఒకటి చేయగలవని నీ దగ్గర ఏదో ఉందని అనుకుంటేనే ఎవరైనా నీకు పని ఇస్తారు.’’ అంటూ తనకు ఎవరూ ఊరికే పని ఇవ్వడం లేదని గుర్తు చేసింది. ఏదేమైనా మన మనసులో ఉన్నదాన్ని బయట పెట్టడమే మంచిదని అంటోంది తమన్నా. ప్రజలు ఎలా భావిస్తారో అని ఎక్కువగా ఆందోళన చెందడం అంతిమంగా మనకు ప్రతికూలంగానే మారుతుంది‘’ అంటూ చెప్పుకొచ్చింది