
ప్రముఖ నటి తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డు యూ వనా పార్ట్‌నర్' వెబ్ సిరీస్ విడుదలపై తాజాగా ప్రకటన వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ నటి డయానా పేంటీ కూడా నటిస్తుంది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నిర్మాత కరణ్ జోహార్ నిన్మించారు. తమన్నాలోని మరో కొత్త కోణాన్ని ఈ మూవీలో చూపించే అవకాశం ఉంది. ఆమె అభిమానులకు ఈ ప్రాజెక్ట్ తప్పకుండా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్‌లో భాగంగా సెప్టెంబర్ 12న 'డు యూ వనా పార్ట్‌నర్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు ఆల్కహాల్ స్టార్టప్‌తో భాగస్వాములుగా మారి కొనసాగిన వారి జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. పురుష ఆదిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో ఇద్దరు మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో మెప్పించనుంది.