షేమ్‌, షేమ్‌.. నటి ఫొటోపై కామెంట్స్‌ | Actress Slammed for Taking Selfie With Ailing Grandma | Sakshi
Sakshi News home page

షేమ్‌, షేమ్‌.. నటి ఫొటోపై కామెంట్స్‌

Jan 3 2017 7:28 PM | Updated on Apr 3 2019 9:15 PM

ఇంగ్లీష్‌ నటి క్లోయె ఫెర్రీ ఫొటోపై నెటిజెన్ల నుంచి విమర్శలు వచ్చాయి.

లండన్‌: ఇంగ్లీష్‌ నటి క్లోయె ఫెర్రీ ఫొటోపై నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న నాన్నమ్మతో కలసి ఆమె ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకున్న ముసలావిడ తీవ్ర అస్వస్థతతో ఆక్సిజన్‌ మాస్క్ ధరించి ఉండగా, ఆమె పక్కన కూర్చుని నవ్వుతూ పోజులిస్తూ ఫెర్రీ ఫొటో దిగింది. ఆమె మరణించిన తర్వాత ఫెర్రీ ఈ  ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లలో పోస్ట్‌ చేసింది. నాన్నమ్మను చాలా ప్రేమిస్తున్నానని, ఎప్పటికీ మరచిపోలేనని, ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ కామెంట్‌ రాసింది. చావు బతుకుల మధ్య పోరాడుతున్న నాన్నమ్మతో ఫొటో దిగి పోస్ట్‌ చేయడం సిగ్గుచేటు అంటూ చాలా మంది నెటిజెన్లు విమర్శలు చేశారు. దీంతో ఆమె సోషల్‌ మీడియా నుంచి ఈ ఫొటోను తొలగించింది. కాగా కొందరు నెటిజెన్లు అంతకుముందు దీన్ని స్ర్కీన్‌ షాట్‌ తీసి షేర్‌ చేసుకున్నారు.

 


 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement