గ్రహాంతరవాసులై ఉంటారు

Actress Revathy slams Mohanlal for his '#MeToo is a fad' comments - Sakshi

‘‘మీటూ ఓ ఫ్యాషన్‌. ఇది ఎక్కువ కాలం నిలబడదు’’ అని ఇటీవలే మలయాళ నటుడు మోహన్‌లాల్‌ కామెంట్‌ చేశారు. మోహన్‌లాల్‌ పేరుని ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలకు స్పందించినట్లుగా నటి రేవతి చేసిన ఓ ట్వీట్‌ స్పష్టం చేస్తోంది. ‘‘మీటూ ఓ ఫ్యాషన్‌ అంటూ ఓ పాపులర్‌ యాక్టర్‌ సంబోధించారు. అలాంటి వాళ్లలో సున్నితత్వం ఎలా తీసుకురాగలం? దర్శకురాలు అంజలీ మీనన్‌ చెప్పినట్టు ‘వేధింపులకు గురి అవ్వడం ఎలా ఉం టుందో వాళ్లకేం తెలుసు?  బహుశా వాళ్లంతా గ్రహాంతరవాసులు అయ్యుండొచ్చు.

జరిగిన చేదు అనుభవాలు బయటకు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో వాళ్లకు తెలియదు. అది ఎలాంటి మార్పు తీసుకొస్తుందో కూడా వాళ్లకు తెలియదు కదా’’ అని ట్వీట్‌ చేశారు రేవతి. మలయాళ నటి భావనపై జరిగిన లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌ను మళ్లీ అమ్మ (అసోసియేషన్‌ ఫర్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)లో సభ్యుడిగా తీసుకున్నారని నటి రేవతి, పార్వతి, రీమా కళ్లింగల్‌ మరికొందరు ప్రశ్నించారు. ఆ తర్వాత వీళ్లంతా కలిసి డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టీవ్‌) ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో స్త్రీల సంరక్షణ, వివక్ష లేని వాతావరణం కోసం పోరాటం చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top