ప్రియాంక చోప్రాకు నోటీసులు | Actress Priyanka Chopra Gets Notice From BMC | Sakshi
Sakshi News home page

Jul 3 2018 10:13 AM | Updated on Apr 3 2019 4:53 PM

Actress Priyanka Chopra Gets Notice From BMC - Sakshi

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ నోటీసులు జారీ చేసింది. ప్రియాంకకు సంబంధించిన వాణిజ్య సముదాయంలో అనధికారిక నిర్మాణాలు చేసినందుకు గాను బీఎంసీ రెండు వేరు వేరు నోటీసులు పంపింది. పశ్చిమ అంథేరిలోని ఒషివారా ప్రాంతంలో ప్రియాంక చోప్రాకు ఓ కమర్షియల్ బిల్డింగ్‌ ఉంది. వాస్తు కోసం ఈ బిల్డింగ్‌కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేసినందుకుగాను ఈ నోటీసులు పంపారు.

అదే బిల్డింగ్‌ లోని బ్యూటీ స్పాకు వచ్చిన వారి ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన మున్సిపల్‌ అధికారులు, 2013లో ముంబై మున్సిపల్ అధికారుల మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు  జరిగినట్టుగా గుర్తించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో చర్చలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement