మోగింది పెళ్లి బాజా! | Actress Monica and Malik to get married? | Sakshi
Sakshi News home page

మోగింది పెళ్లి బాజా!

Jan 6 2015 11:43 PM | Updated on Sep 2 2017 7:19 PM

మోగింది పెళ్లి బాజా!

మోగింది పెళ్లి బాజా!

చంటి’ తదితర చిత్రాల్లో బాల తారగా కనిపించి, అటుపై ‘శివరామరాజు’ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన మోనికా గుర్తుంది కదూ!

‘చంటి’ తదితర చిత్రాల్లో బాల తారగా కనిపించి, అటుపై ‘శివరామరాజు’ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన మోనికా గుర్తుంది కదూ! తెలుగులో ‘మా అల్లుడు వెరీగుడ్డు’తో పాటు పలు చిత్రాల్లో కథానాయికగా చేశారామె. గత ఐదారేళ్లుగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైన మోనిక త్వరలో ఇల్లాలు కాబోతోంది. ఈ నెల 11న మాలిక్ అనే వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరగనుంది. గత ఏడాది ఇస్లాం మతానికి మారి, తన పేరుని రహీమాగా మార్చుకున్నారు మోనిక. మాలిక్ ముస్లిమ్ కాబట్టి, తనకోసమే మార్చుకుందని అప్పట్లో ఓ వార్త వచ్చింది. అయితే, ఆ సంప్రదాయం అంటే ఇష్టం కాబట్టే మారానని ఆమె పేర్కొన్నారు. ఆ సంగతలా ఉంచితే... మాలిక్‌తో ఆమె పెళ్లి ఇస్లాం పద్ధతిలో జరగనుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని మోనిక నిర్ణయించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement