శస్త్రచికిత్సతో స్లిమ్‌గా..

Actress Lakshmi Menon New Look  - Sakshi

తమిళ సినిమా: కాస్త బొద్దుగా ఉన్న కథానాయికలు బరువు తగ్గి, మరింత నాజూగ్గా తయారవడానికి నోరు కుట్టుకుని, కసరత్తుతో నానా తంటాలు పడుతున్నారు. కోట్లు గడిస్తున్నా ఆహారపు కట్టుబాట్లంటూ డైట్‌ చేస్తున్నారు. అదీ మీరి కొందరు శస్త్ర చికిత్సకు వెనుకాడడం లేదు. తాజాగా నటి లక్ష్మీమీనన్‌ ఇదే బాట పట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ సెటిల్‌ అయిపోయింది, వరుసగా అవకావాలు అందిపుచ్చుకుంది. దీంతో కాస్త బొద్దుగా ఉన్నా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. పైగా నేనిలానే ఉంటాను అని స్టెట్‌మెంట్‌ కూడా ఇచ్చేసింది. 

అయితే అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో అమ్మడికి అందం గురించి గుర్తొచ్చినట్లుంది. కొత్తవారు దూసుకురావడంతో లక్ష్మీమీనన్‌ను కోలీవుడ్‌ దాదాపూ పక్కన పెట్టేసింది. ఆ మధ్య నటించిన రెక్క చిత్రంలో మరీ లావుగా కనిపించింది. ఇటీవల బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టిందట. వ్యాయామం, యోగా లాంటి కసరత్తులతో కాస్త బరువు తగ్గించుకున్న లక్ష్మీమీనన్‌కు ఫలితంగా ప్రభుదేవాతో యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఇంకా స్లిమ్‌గా తయారవ్వాలన్న తలంపుతో బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మొత్తం మీద లక్ష్మీమీనన్‌ సోషల్‌ మీడియాకు విడుదల చేసిన ఫొటోల్లో చాలా స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించింది. అదేవిధంగా ఇప్పటి వరకు సంప్రదాయబద్ధంగా నటించిన లక్ష్మీమీనన్‌ ఇకపై గ్లామర్‌ పాత్రలకు సై అనేవిధంగా దర్శక నిర్మాతలకు హింట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top