జెంటిల్ మెన్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్‌ | Actress Khushboo Thanks to Pawan Kalyan | Sakshi
Sakshi News home page

జెంటిల్ మెన్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్‌

Dec 18 2017 1:18 PM | Updated on Mar 22 2019 5:33 PM

Actress Khushboo Thanks to Pawan Kalyan - Sakshi

సాక్షి, సినిమా : త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుష్బూ స్వయంగా చిత్ర యూనిట్ కు స్పెషల్‌ థాంక్స్‌ తెలియజేశారు. తను ఇలాంటి వైవిధ్యమైన పాత్రలకోసమే ఇన్నాళ్లు ఎదురుచూశానని ట్వీట్ చేసింది.

'ఇలాంటి మంచి పాత్రలు చేసేందుకే ఇన్నాళ్లు వెయిట్ చేశాను. నాపై ఇంత నమ్మకం ఉంచిన త్రివిక్రమ్ కు థ్యాంక్స్. పక్కా జెంటిల్ మేన్ పవన్ కల్యాణ్ కు, హారిక-హాసిని బ్యానర్ కు ధన్యవాదాలు.' తన అజ్ఞాతవాసి పోస్టర్ ను ఖుష్బూ ట్వీట్ చేసింది. రేపు జరిగే ఆడియో లాంచ్ లో ఆమె క్యారెక్టర్ పై  మరింత క్లారిటీ రానుంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా పాత్రను త్రివిక్రమ్ ఎంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారో, ఈ సినిమాలో ఖుష్బూ పాత్రను అదే స్థాయిలో మలిచారని ప్రచారం జరుగుతోంది. 

ఈ నెల 19వ తేదీన ఆడియో వేడుక జరుపుకుని, వచ్చేనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఖుష్బూతోపాటు ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement