మా అమ్మయి చాలా యంగ్ | Actress Hansika Motwani 24 years completed | Sakshi
Sakshi News home page

మా అమ్మయి చాలా యంగ్

Nov 20 2016 2:26 AM | Updated on Sep 4 2017 8:33 PM

మా అమ్మయి చాలా యంగ్

మా అమ్మయి చాలా యంగ్

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాటను యువత ఇప్పటికీ మరిచిపోదు. పోకిరి చిత్రంలో ముమైత్‌ఖాన్ నర్తించిన

 ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాటను యువత ఇప్పటికీ మరిచిపోదు. పోకిరి చిత్రంలో ముమైత్‌ఖాన్ నర్తించిన ఆ పాట యూత్‌కి ఎప్పటికీ కిక్కే. ఆ విషయం మాకు తెలుసు.. ఇంతకీ మీరు చెప్పొచ్చేదేమిటంటారా? నటి హన్సిక అమ్మ మాటలు చూస్తే ముమైత్‌ఖాన్ పాట గుర్తుకొచ్చిందిలెండి. చాలా మంది హీరోయిన్ల తల్లుల మాదిరిగానే హన్సిక తల్లి మోనా మోత్వాని తన కూతురి వయసు గురించి మాట్లాడారు. మా అమ్మాయి చాలా యంగ్. ఈ మధ్యే 24 ఏళ్లు పూర్తి అయ్యాయి. 
 
 అసత్య ప్రచారాలు చేయకండి అని కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. హన్సిక తల్లికి అంత కోపం ఎందుకొచ్చిందో ఈ పాటికే అర్థమై ఉంటుంది. విషయం ఏమిటంటే అందాల భామ హన్సిక పెళ్లికి రెడీ అవుతున్నారనని, మోనా మోత్వాని ఆమెకు వరుడిని వెతికే పనిలో ముమ్మరంగా ఉన్నారనే ప్రచారం సోషల్‌మీడియా హోరెత్తిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. హన్సికకు కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. జయంరవితో నటించిన ఒక చిత్రం భోగన్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
 
  కొత్తగా అవకాశాలు లేవు. ఇక చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లో లక్కున్నోడు అనే ఒక్క చిత్రంలో నటిస్తున్నారు. అయితే హన్సిక కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. హన్సిక నటించిన చివరి చిత్రం మనిధన్. ఆ తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. భోగన్ తరువాత ఇంకో చిత్రం లేదు. 
 
 ఇలాంటి కూడికలు తీసివేతలు లెక్క కట్టే.. హన్సిక పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక పోతే మా అమ్మాయి చాలా యంగ్ అని హన్సిక తల్లి మోనా అనడంలోనూ తప్పులేదు. ఎందుకంటే మూడున్నర పదులు దాటిన నాయికలు ఇంకా పెళ్లికి తొందరేముంది అంటుంటే 24 ఏళ్ల హన్సికకు అప్పుడే పెళ్లి ఆలోచనేమిటన్నది ఆమె తల్లి భావనై ఉండవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement