ఒంటరి జీవితమే ఆనందంగా ఉంది: హీరోయిన్‌ | Actress Hansika Motwani Life After Divorce | Sakshi
Sakshi News home page

ఒంటరి జీవితమే ఆనందంగా ఉంది: హీరోయిన్‌

Apr 17 2026 7:05 AM | Updated on Apr 17 2026 8:27 AM

Actress Hansika Motwani Life After Divorce

మన చుట్టూ ఉన్న చాలామంది తమ జీవితంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఆనందపడుతుంటారు. నటి హన్సిక మోత్వానీ ఈ కోవకు చెందిన అమ్మాయేనని అనిపించక మానదు. తమిళం, తెలుగు,హిందీ వంటి భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించిన  హన్సిక. అలా 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబై ‍బ్యూటీ ఎప్పుడూ వార్తలో ఉంటుంటారు. ఇంతకు ముందు ప్రేమ వ్యహారం గురించి ప్రచారం జరిగింది. ఎట్టకేలకు 2022లో సోహైల్‌ కత్తారియా అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చాలా ఆడంబరంగా జరిగింది.

అయితే వీరి వివాహ జీవితం ఎక్కువగా సాఫీగా సాగలేదు. పెళ్లి అయిన కొద్ది కాలానికే మనస్పర్ధలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. ఇటీవలే విడాకులు కూడా పొందారు. దీంతో భర్త నుంచి భరణం  కోరుతూ నటి హన్సిక కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారం న్యాయస్ధానంలో ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే నటి హన్సిక తన కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు చుట్టేయడంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాదిలోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్న ఈ అమ్మడు తదిపరి దక్షిణాదిలోని దేవాలయాలను సందర్శంచడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

కాగా ఇటీవల అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించిన హన్సిక  ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అంతే కాదు చాలా స్వేచ్చగా ఉన్నానని, ఒంటరితనం తనకు ఎప్పుడూ ఇష్టమని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఒంటరిజీవితంలో చాలా సంతోషం కలిగింది అని అన్నారు. తన వాళ్ల కోసం సమయాన్ని గడపడం, తనకు నచ్చింది చేయడం వంటి విషయాలతో చాలా సంతోషంగా ఉన్నానని నటి హన్సిక చెప్పుకొచ్చారు.ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌ అవుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement