‘నేను చచ్చిపోలేదు.. బతికే ఉన్నా’ | Actor Mumtaz Says She Is Fine Rubbishes Rumours About Her Demise | Sakshi
Sakshi News home page

నేను బతికే ఉన్నా: సీనియర్‌ నటి

May 22 2020 3:35 PM | Updated on May 22 2020 3:42 PM

Actor Mumtaz Says She Is Fine Rubbishes Rumours About Her Demise - Sakshi

లండన్‌: తాను ఆరోగ్యంగా ఉన్నానని సీనియర్‌ నటి ముంతాజ్‌ అన్నారు. తను చనిపోయానని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపడేశారు. ఒకవేళ తాను మరణిస్తే ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులే ప్రపంచానికి చెబుతారని... అంతవరకు గాసిప్‌రాయుళ్లు కాస్త సైలెంట్‌గా ఉండాలని చురకలు అంటించారు. మునుపటి కంటే కూడా ఇప్పుడే ఎంతో ఉత్సాహంగా ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌ చేశారు. కాగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముంతాజ్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో 72 ఏళ్ల ముంతాజ్‌ మరణించారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమయ్యాయి. (క్షమాపణలు కోరిన కపిల్‌ శర్మ)

ఈ విషయంపై స్పందించిన ముంతాజ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నా. నా గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇది జోక్‌ చేయాల్సిన విషయమా? గతేడాది కూడా ఇలాగే రూమర్లు వ్యాప్తి చేశారు. నా బంధువులు, స్నేహితులు ఈ విషయం విని కంగారుపడ్డారు. దయచేసి మమ్మల్ని ఇలా ఇబ్బందుల్లోకి నెట్టవద్దు. ఈ సారి నా కూతురు, మనుమలు, మనుమరాళ్లు, అల్లుడు, నా భర్త అంతా ఒకేచోట ఉన్నాం. లాక్‌డౌన్‌ మమ్మల్ని కలిసి ఉండేలా చేసింది. ఎంతో ఆనందంగా, క్షేమంగా ఉన్న సమయంలో ఇలాంటి వార్తలు ప్రచారం కావడం ఇబ్బందికరంగా ఉన్నాయి. నన్నెందుకు చంపాలని భావిస్తున్నారు. సమయం వచ్చినపుడు నేనే వెళ్లిపోతాను కదా. అదేమీ దాయాల్సినంత రహస్యం కాదు కదా. నేను చనిపోగానే నా కుటుంబ సభ్యులు అందరికీ చెబుతారు’’అని అసహనం వ్యక్తం చేశారు. (నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement