యాక్షన్ ఎంటర్‌టైనర్ | Action Entertainer | Sakshi
Sakshi News home page

యాక్షన్ ఎంటర్‌టైనర్

Nov 15 2015 12:51 AM | Updated on Sep 3 2017 12:29 PM

యాక్షన్ ఎంటర్‌టైనర్

యాక్షన్ ఎంటర్‌టైనర్

భోజ్‌పురిలో ఘనవిజయం సాధించిన ‘ఆజ్ కే కరణ్ అర్జున్’ చిత్రం ‘నేటి విజేతలు’గా తెలుగులోకి అనువాదమైంది.

భోజ్‌పురిలో ఘనవిజయం సాధించిన ‘ఆజ్ కే కరణ్ అర్జున్’ చిత్రం ‘నేటి విజేతలు’గా తెలుగులోకి అనువాదమైంది. శ్రీమతి సరిత తిరువీధుల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్.కే తెలుగులోకి విడుదల చేయనున్నారు. సుధాకర్ తిరువీధుల సహ నిర్మాత.  పాకీ హెగ్డే, క్రిషా ఖండేల్కర్ నాయికలుగా నటించారు. ఆర్.కే మాట్లాడుతూ - ‘‘ఇందులో భోజ్‌పురి సూపర్ స్టార్స్ దినేష్ లాల్, ప్రవేష్ లాల్ హీరోలుగా నటించారు. హీరోలిద్దరూ విలన్‌పై ఎలా పగ తీర్చుకున్నారు అనేది కథ? అద్భుతమైన పోరాటాలు, రెండు ప్రత్యేక పాటలు, కామెడీతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో పాటలను, ఈ నెల చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement