మరో వెబ్‌ సిరీస్‌లో... | Abhishek Bachchan Makes Digital Debut with Breathe season 2 | Sakshi
Sakshi News home page

మరో వెబ్‌ సిరీస్‌లో...

Dec 20 2018 12:42 AM | Updated on Dec 20 2018 12:42 AM

Abhishek Bachchan Makes Digital Debut with Breathe season 2 - Sakshi

అభిషేక్‌ బచ్చన్‌

వెబ్‌ సిరీస్‌లకి ఇప్పుడు ఎంతక్రేజ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే అమెజాన్, నెట్‌ ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని పెద్ద పెద్ద సంస్థలు వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయి. ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా నటించేందుకు సినిమా స్టార్స్‌ సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ కూడా ‘బ్రీత్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఇప్పటికే ఆయన ‘సైడ్‌ హీరో’ అనే వెబ్‌ సిరీస్‌లో అతిథి పాత్రలో అలరించారు. కానీ ‘బ్రీత్‌’ సీజన్‌ 2లో మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనున్నారు. మయాంక్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌ సిరీస్‌ని అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మించనుంది. ‘బ్రీత్‌’లో ఇన్వెస్టిగేటివ్‌ పోలీసాఫీసర్‌గా కనిపించిన అమిత్‌ సాద్‌ ‘బ్రీత్‌ 2’లో కూడా అదే పాత్ర చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement