అమీర్ ఖాన్ మరో ప్రయోగం! | Aamir Khan Another experiment ! | Sakshi
Sakshi News home page

అమీర్ ఖాన్ మరో ప్రయోగం!

Apr 30 2015 6:19 PM | Updated on Sep 3 2017 1:10 AM

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

అతను ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. కొత్తతరహా కథలతో వస్తాడు.

అతను ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. కొత్తతరహా కథలతో వస్తాడు.  అందుకే అతడిని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేటయం అతనికి అలవాటు. అసాధారణ కథలే అతనికి ఆయుధాలు. గతంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించిన అమీర్ ఖాన్ ఇప్పుడు ముగ్గురు బిడ్డల తండ్రిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అమీర్ ఖాన్ కూడా అటువంటి కథతో ముందుకు వస్తున్నాడు. మహావీర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్ మూవీలో అమీర్ విజృంభించబోతున్నాడు. పీకే లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అమీర్ చేస్తున్న చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ మూవీలో మహావీర్ సింగ్ కూతుళ్లు గీత, బబిత, సంగీతల పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ పాత్రల ఎంపిక కోసం ఎన్ని ఆడిషన్స్ జరిపినా ఇంతవరకూ ఎవ్వరూ ఎంపిక కాలేదు. ఈ మూవీ కోసం అమీర్ తన లుక్ని పూర్తిగా మార్చేశాడు. 22 కేజీల బరువు కూడా తగ్గి, మహావీర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో మల్లికా షెరావత్ అమార్ ఖాన్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్లో బయోపిక్స్ వెల్లువ ఎక్కువైంది. అమీర్ లాంటి స్టార్ కూడా దాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. సినిమా అంటే ప్రాణం పెట్టే అమీర్, మహావీర్ పాత్రను అద్భుతంగా పండిస్తాడని  వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తోన్న దంగల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. మొత్తానికి ముగ్గురు టీనేజ్ గర్ల్స్కు తండ్రిగా నటించడానికి సిద్ధమైన అమీర్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement