‘ఆ దర్శకుడు తప్పుగా మాట్లాడాడు’

Aahana Kumra Says Prakash Jha Made Me Uncomfortable While Filming Lipstick Under My Burkha - Sakshi

ముంబై : మీటూ ఉద్యమంలో భాగంగా మూవీ సెట్స్‌పై ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటీమణులు తమ అనుభవాలను ధైర్యంగా వెల్లడిస్తున్న క్రమంలో తాజాగా మరో నటి తనకు ఎదురైన అసౌకర్య పరిస్థితిని బహిర్గతం చేశారు. 2016లో లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా సెట్‌లో జరిగిన ఘటనను నటి అహనా కుమ్రా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ఈ సినిమా సెట్‌లో ఓ శృంగార సన్నివేశం తెరకెక్కిస్తుండగా దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా సెట్‌లోకి వచ్చి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తనకు చాలా అసౌకర్యంగా అనిపించాయని తెలిపారు. దీంతో తాను దర్శకులు అలంక్రిత శ్రీవాస్తవ వద్దకు వెళ్లి ఆయన తనకు దర్శకుడు కాదని, సెట్‌లో ఎందుకు ఉన్నారని అడిగానని చెప్పారు. ఆయన నుంచి తాను అలాంటి వ్యాఖ్యలు ఎందుకు వినాలని, ఆయన కేవలం నిర్మాతేనని అలంక్రితకు చెప్పినట్టు వెల్లడించారు.

ఇక తాను చెప్పిన వెంటనే నిర్మాత ప్రకాష్‌ ఝాను సెట్‌ నుంచి వెళ్లాల్సిందిగా అలంక్రిత కోరగా, అప్పుడాయన వెళ్లిపోయాడని తెలిపారు. ఆయన సెట్‌లో ఉంటే తమకు ఇబ్బందికరమని అర్ధం చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. కాగా, అలంక్రిత శ్రీవాస్తవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016లో విడుదలైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top