యూఎస్లో 'ఆగడు'

యూఎస్లో 'ఆగడు' - Sakshi


హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబుకు అమెరికాలో అసంఖ్యకంగా అభిమానులు ఉన్నారు. వారి కోసం ప్రిన్స్ నటించిన తాజా చిత్రం 'ఆగడు' అమెరికాలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్రాన్ని సబ్టైటిల్స్తో అమెరికాలో విడుదల చేస్తామన్నారు. అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర వెల్లడించారు. అమెరికాలోని కొన్ని సినిమా థియెటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అమెరికాలోని తెలుగువారితోపాటు అక్కడి స్థానికులు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పారు.


అమెరికా బాక్సాఫీసుల వద్ద ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుందని అనిల్ సుంకర ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ బాబు, తమన్నా హీరోహీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ ఓ ఐటమ్ సాంగ్లో నటించిన సంగతి తెలిసిందే.  ఆగస్టు 30న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఆగడు చిత్రం ఆడియోను విడుదలైన విషయం విదితమే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top