రాజమౌళి అప్పుడే చెప్పారు : ప్రభాస్ | Aadi's Garam trailer launched | Sakshi
Sakshi News home page

రాజమౌళి అప్పుడే చెప్పారు : ప్రభాస్

Dec 11 2015 11:48 PM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళి అప్పుడే చెప్పారు : ప్రభాస్ - Sakshi

రాజమౌళి అప్పుడే చెప్పారు : ప్రభాస్

గరం’ టైటిల్, ట్రైలర్ బాగున్నాయి. మదన్ చాలా ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అని రాజమౌళి

‘‘ ‘గరం’ టైటిల్, ట్రైలర్ బాగున్నాయి.  మదన్ చాలా ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అని రాజమౌళి నాతో నాలుగేళ్ళ క్రితమే చెప్పారు. హీరో ఆది ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఆదికీ, మదన్‌కూ ఈ సినిమా పెద్ద బ్రేక్ నివ్వాలి.’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆది, అదా శర్మ జంటగా మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బేనర్‌పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’.
 
 ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను హైద రాబాద్‌లో ప్రభాస్ ఆవిష్క రించారు. ఆది మాట్లాడుతూ - ‘‘ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న హీరో అయిన ప్రభాస్ చేతుల మీదుగా ‘గరం’ టీజర్ ఆవిష్కరణ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు.
 
  ‘‘ప్రభాస్ మా ‘గరం’ టీజర్‌ను ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే ‘గరం’ ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని సాయికుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం ప్రభాస్‌ను కలిశాననీ, ఇప్పటికీ తనను గుర్తుపెట్టుకున్నారనీ, ‘గరం’ క్లాస్‌నీ, మాస్‌నీ హ్యాపీ చేస్తుందనీ మదన్ పేర్కొన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ టి. సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement