'పులి' మరో ట్రైలర్ విడుదల | 2nd trailer from puli team | Sakshi
Sakshi News home page

'పులి' మరో ట్రైలర్ విడుదల

Sep 24 2015 10:04 AM | Updated on Sep 3 2017 9:54 AM

'పులి' మరో ట్రైలర్ విడుదల

'పులి' మరో ట్రైలర్ విడుదల

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పులి టీం ప్రమోషన్లో వేగం పెంచింది. ఇప్పటికే వరుస పోస్టర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పులి టీం, తాజాగా మరో థియట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

విడుదలకు సమయం ఆసన్నం అవుతుండటంతో పులి టీం ప్రమోషన్లో వేగం పెంచింది. ఇప్పటికే వరుస పోస్టర్లతో సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తున్న పులి టీం, తాజాగా మరో థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. సినిమా గ్రాండియర్ను పరిచయం చేయటంతో పాటు సినిమాలోని పాత్రలను కూడా ఈ ట్రైలర్లో రివీల్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్గా నిలుస్తున్నాయి. అందుకే రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే 5 లక్షల వ్యూస్తో సత్తా చాటాడు ఇలయదళపతి విజయ్.

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న పులి సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రీదేవితో పాటు.. సుదీప్, శృతిహాసన్, హన్సిక ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికేట్తో అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement