హుహూ..!

2.0 Teaser Clips Leaked, Another Rajinikanth-Starrer Falls Prey to Piracy After Kaala - Sakshi

‘హుహూ’...‘2.0’ టీజర్‌లో ఇదిగో ఇలాగే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు రజనీకాంత్‌. అవునా! మరి..‘2.0’టీజర్‌ను అధికారికంగా రిలీజ్‌ చేయలేదు కదా! అంటే..నిజమే అధికారికంగా రిలీజ్‌ చేయకుండానే ‘2.0’ టీజర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్‌ ముఖ్య తారలుగా ఆల్మోస్ట్‌ 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన చిత్రం ‘2.0’. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్‌ వర్క్‌ పెండింగ్‌ ఉండటం వల్ల వాయిదా వేశారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా ఆల్మోస్ట్‌ 90 సెకన్ల నిడివి ఉన్న ‘2.0’ టీజర్‌ సోషల్‌ మీడియాలో లీకైంది. ఈ లీకేజ్‌ పై రజనీకాంత్‌ కూతురు సౌందర్యా రజనీకాంత్‌ స్పందిస్తూ– ‘‘అధికారికంగా ప్రకటించడానికి ముందే ఆన్‌లైన్‌లో ఇలాంటివి లీక్‌ అవ్వడం సహించరానిది.

ప్రొత్సహించకూడని విషయం. ఓన్లీ కొన్ని సెకన్ల ఎగై్జట్‌మెంట్‌ కోసం మూవీ యూనిట్‌ హార్డ్‌వర్క్‌ని, కష్టాన్ని, సెంటిమెంట్స్‌ను అగౌరవపరచడం సరికాదు. ఇది సిగ్గుపడ్సాలిన విషయం. పైరసీని ఆపండి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ని దుర్వినియోగం చేయకండి’’ అని అన్నారామె. మరోవైపు లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు చెందిన ఓ ముఖ్య ప్రతినిధి బర్త్‌డే సందర్భంగా వీఐపీలకు ‘2.0’ టీజర్‌ స్పెషల్‌గా వేశారట. అక్కడి నుంచి ఈ ‘2.0’ టీజర్‌ లీకైందన్న వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్‌ హీరోగా రూపొందిన ‘కాలా’ టీజర్‌ కూడా అధికారికంగా చెప్పిన సమయానికన్నా ముందే ఆన్‌లైన్‌లో లీకైన విషయం తెలిసిందే. ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top