నాతో నేను! | 15 years of Trisha Krishnan in movie industry | Sakshi
Sakshi News home page

నాతో నేను!

Jun 15 2018 12:36 AM | Updated on Aug 28 2018 4:32 PM

15 years of Trisha Krishnan in movie industry - Sakshi

త్రిష

రోజూ మనల్ని ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఇష్టం ఉంటే మనం కూడా మాటలు కలుపుతాం. కానీ మాట్లాడిన అందరూ మనకు మిత్రులైపోరు. ఒకవేళ మిత్రులైనా అందరితో అన్నీ పంచుకోలేం. అందుకే రోజులో ఒకసారైనా మనల్ని మనం పలకరించుకుని, ఆత్మపరిశీలన చేసుకుంటూ లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. ఇదే విషయాన్ని చెబుతున్నారు కథానాయిక త్రిష. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. ప్రాబ్లమ్స్‌ వచ్చినప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారట.

‘‘నాతో నేను ఎక్కవ టైమ్‌ గడపడమే నా స్ట్రైస్‌ బస్టర్‌. అవసరమైతే సెల్ఫ్‌ హీలింగ్‌ చేసుకుంటాను. నాకు గ్రేట్‌ ఫ్యామిలీ ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు. వారితో కూడా టైమ్‌ స్పెండ్‌ చేస్తా. కానీ నాకు నేను తోడుగా ఉండటం మాత్రం మరిచిపోను’’ అంటున్నారు త్రిష. ఇక సినిమాల విషయానికొస్తే... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు కంప్లీట్‌ అవుతున్నప్పటికీ ఆమె జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రజెంట్‌ అరడజను తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు త్రిష. ఆమె నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరో మూడు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement