తనపై అత్యాచారం చేశాడని.. | 13-year-old girl beheads 5-year-old son of her ‘rapist | Sakshi
Sakshi News home page

తనపై అత్యాచారం చేశాడని..

Oct 23 2015 11:16 AM | Updated on Sep 3 2017 11:22 AM

తనపై అత్యాచారం చేశాడని..

తనపై అత్యాచారం చేశాడని..

ఓ వ్యక్తి చేతిలో్ అత్యాచారానికి గురైన బాలిక(13) అతడి ఐదేళ్ల కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

లక్నో: ఓ వ్యక్తి చేతిలో  అత్యాచారానికి గురైన  బాలిక(13) అతడి కుమారుడిపై  ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మాంసం ముద్దగా మారిన బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండంతో ఈ  దారుణం వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కొడుకు అమిత్(5)ను బాధితురాలు పథకం ఎత్తుకెళ్లి దారుణంగా హత్య చేసింది. ఆ బాలుడి తల నరికి నరికి.. ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా రాళ్లతో చిధ్రం చేసింది.

అనంతరం మృతదేహాన్ని పాలిథీన్  బ్యాగ్ లో చుట్టి కిరోసిన్ పోసి నిప్పంటించింది.  అయితే మరునాడు ఆ మూటను కుక్కలు వీధిలోకి లాక్కొచ్చాయి. దీంతో  సగం కాలిన మృతదేహపు  శరీర భాగాలు బయటపడ్డాయి.  ఆ దృశ్యాలను చూసిన పోలీసులు  సైతం నివ్వెర పోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. చివరిసారిగా అమిత్తో ఉన్న బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఆమె నేరాన్ని అంగీకరించింది.

బాలుని తండ్రి రింకూ.. తనకు  మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిపింది.  అందుకు ప్రతీకారంగానే తాను ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంది.  దీంతో రింకూతోపాటు బాలికపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement