పద్మావత్‌ కోసం వెనక్కితగ్గిన ప్యాడ్‌మ్యాన్‌ | ‘PadMan' postponed for Padmaavat | Sakshi
Sakshi News home page

పద్మావత్‌ కోసం వెనక్కితగ్గిన ప్యాడ్‌మ్యాన్‌

Jan 19 2018 9:04 PM | Updated on Jan 19 2018 9:06 PM

‘PadMan' postponed for Padmaavat - Sakshi

ముంబై : వివాదాల సుడిగుండాలుదాటి విడుదలకు సిద్ధమైన ‘పద్మావత్‌’కు బాలీవుడ్‌ బాసటగా నిలిచింది. సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీలు మారుతూ.. చివరికి జనవరి 25కు ఖరారైన నేపథ్యంలో ఆ రోజే విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాపడ్డాయి. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ప్యాడ్‌ మ్యాన్‌ సినిమా జనవరి 25న విడుదలకావాల్సి ఉండగా, భన్సాలీ అభ్యర్థన మేరకు విడుదల తేదీని ఫిబ్రవరి 9కి పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు. బుధవారం ముంబైలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో భన్సాలీ-అక్షయ్‌లు ఈ విషయాన్ని చెప్పారు.

‘సినిమా విడుదల కావడం వారికి(పద్మావత్‌ రూపకర్తలకు) ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నా సినిమాను విడుదల చేయడం భావ్యంకాదు. అందుకే ఫిబ్రవరి 9కి వాయిదావేస్తున్నాను’ అని అక్షయ్‌ కుమార్‌ చెప్పారు. అడిగినవెంటనే వాయిదాకు అంగీకరించిన అక్షయ్‌కి కృతజ్ఞుడినని పద్మావత్‌ దర్మకుడు భన్సాలీ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement